Friday, October 4, 2024

TG | రైతు హామీల సాధనకు బీజేపీ దీక్ష !

తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ నెల 30న దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ మండిపడుతోంది.

రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నేతలు అంటున్నారు. రైతు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న ఇందిరాపార్కు దగ్గర 24 గంటల దీక్ష బీజేపీ చేపట్టనుంది. ఈ దీక్ష అక్టోబర్ 1న ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement