Friday, April 19, 2024

రాజీనామాలు చేసినా బీజేపీదే గెలుపు : తోమర్‌..

యూపీ బీజేపీ నుంచి ఎస్‌పీలో భారీగా వలసలు పెరగడంతో.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందించారు. యూపీలో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదని, రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి బీజేపీకి మంచి మద్దతు లభిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లిd ఎన్నికల్లో మళ్లిd బీజేపీదే అధికారం అంటూ జోస్యం చెప్పారు. ప్రజలు తమను మరోసారి ఆశీర్వదిస్తారని చెప్పుకొచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. కీలక నేతలు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ ఓడిపోతుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని వివరించారు. అన్ని రంగాల్లో యూపీ ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ప్రతీ వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పుకొచ్చారు. కొంత మంది నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరినంత మాత్రాన బీజేపీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement