Thursday, April 25, 2024

కరోనా ఎఫెక్ట్: వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోను ఇప్పుడు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపడుతున్నాయి. బీహార్ లో సైతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ లోని వైద్యులు, వైద్యసిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి సంబంధించి ఎవరూ కూడా ఏప్రిల్ 5 వ తేదీ వరకు సెలవు తీసుకోకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు వ్యాక్సిన్ అందిస్తూనే మరోవైపు కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నితీశ్ కుమార్ సర్కారు కరోనా వ్యాక్సినేషన్ ను ఉచితంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement