Wednesday, April 24, 2024

Big boss: తొలి వారం ఈ ఆరుగురిలో ఒకరు ఔట్..

బిగ్ బాస్ సీజ‌న్ 5 లో హౌస్ లో రచ్చ మొదలైంది. మొదటి వారమే కంటెస్టంట్ల నామినేషన్ల పేరుతో కంటెస్టంట్ల మధ్య బిగ్ బాస్ చిచ్చుపెట్టాడు. సాధార‌ణంగా ప్ర‌తి సోమ‌వారం నామినేష‌న్ ప్రక్రియ ఉంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి వారం నామినేష‌న్ ప్ర‌క్రియ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవ‌రినైతే నామినేట్ చేయాల‌నుకుంటున్నారో వారి ఫొటోల‌తో ఉన్న చెత్త బ్యాగులు తీసుకొని డ‌స్ట్ బిన్‌లో వేయాల‌ని చెప్పాడు. ఇలా ప్ర‌తి కంటెస్టెంట్ స‌రైన కార‌ణం చెప్పి ఇద్ద‌రి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేయాల్సిందిగా కోరాడు. అయితే హౌజ్‌లో అడుగు పెట్టి ఒక్క‌రోజే కావ‌డంతో నామినేట్ చేయడానికి నానా కార‌ణాలు వెతుక్కోవ‌ల్సి వ‌చ్చింది. ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో కొంద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌ర‌గ‌గా, కొంద‌రు త‌మ‌పై వేసిన ఆరోప‌ణ‌లు ఖండించారు. జెస్సీ, కాజ‌ల్, హమీదా వంటి వారు ఎమోష‌న‌ల్ అయి క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక చివ‌రిగా ఫ‌స్ట్ వీక్‌లో ఎక్కువ ఓట్లు వ‌చ్చిన రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు నామినేష‌న్‌లో ఉన్నారు.ఇందులో నుండి ఒకరు బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నారు.

ఇది కూడా చదవండి: షెకావత్ తో నీటి అంశాలపై కెసిఆర్ చర్చ

Advertisement

తాజా వార్తలు

Advertisement