Tuesday, April 23, 2024

కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ సిరి హ‌న్మంత్- క్లోజ్ గా బాయ్ ఫ్రెండ్ తో ఫొటోలు

బిగ్ బాస్ షోలో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ తో ప్రేమాయ‌ణం న‌డిపింది న‌టి సిరి హ‌న్మంత్..వారిద్ద‌రూ ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్లు వీరిద్దర మధ్య ఉన్న ఆ బంధాన్ని చూసి దీప్తి.. షణ్ముఖ విడిపోయారు. అలాగే శ్రీహాస్ కూడా సిరికి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక కార్ షోరూం కి వచ్చారు. కాగా రూ.20ల‌క్ష‌లు పెట్టి ఓ కారును కొన్నారు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నా ఫొటోస్ ను ఇన్స్టాల్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ ను చూసి వారి అభిమానులు సందడి చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ సిరిని ముందు డ్రైవింగ్ నేర్చుకో అని సెటైర్ వేస్తున్న వీడియోలు .. ఫొటోస్ ను షేర్ చేశారు. అయితే మొత్తానికి వీళ్ళు కలిసిపోయారు అని అర్థమవుతుంది. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన కూడా ఇలాగే కలవాల‌ని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement