Thursday, September 16, 2021

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బిగ్​బాస్ ఫేమ్ సిద్దార్థ్ మృతి

చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు నటులు మృతి చెందగా.. తాజాగా మరో నటుడు మృతి చెందడం విషాదం నింపింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా (40) కన్నుమూశారు. గుండె నొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్​కు గురయ్యారు.

మోడల్​గా పరిచమైన సిద్దార్థ్.. బుల్లితెర సీరియల్ బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు)తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఝలక్ దిఖ్లా జా 6, బిగ్​బాస్ 13షోలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందాడు. కరణ్ జోహర్ నిర్మించిన హంప్టీ శర్మా కీ దుల్హానియా చిత్రంలో సహాయ నటుడి పాత్రలో నటించారు. సిద్దార్థ్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో 12 డిసెంబర్ 1980న ముంబైలో అశోక్ శుక్లా, రీటా శుక్లా దంపతులకు జన్మించిన సిద్ధార్థ్.. సెయింట్ జేవియర్స్ హైస్కూల్, ఫోర్ట్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అనంతరం ఇంటీరియర్ డిజైనింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News