Sunday, February 5, 2023

బిగ్‌బాస్-5: ఈ వారం వాళ్లిద్దరిలోనే ఒకరు ఔట్

బిగ్‌బాస్‌లో ఈ వారం నామినేష‌న్‌ ప్రక్రియలో యాంకర్ రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఉన్నారు. ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న వీళ్ల‌లో ఎవ‌రు సేఫ్ అవుతారు, ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌స్తార‌నే దానిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇద్ద‌రు కంటెస్టెంట్స్ సింపతీతో సేఫ్ కాగా, ఈ వారం బ‌య‌ట‌కు వ‌చ్చేది మ‌హిళా కంటెస్టెంట్ అని తెలుస్తోంది.

ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న యాంకర్ రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీల‌లో ర‌వికి , కాజ‌ల్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి వారు త‌ప్ప‌క సేవ్ అవుతారు. ఇక సీరియల్ నటుడు మానస్, మోడల్ జశ్వంత్ అమాయకంగా కనిపిస్తూ సింపతితో ఓట్లేయింకుంటున్న‌ట్టు స‌మాచారం. జెస్సీకి కొంద‌రు మ‌ద్ద‌తు ఇస్తుండ‌గా, మ‌రి కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. ఏదేమైనా మాన‌స్, జెస్సీ కూడా సేఫ్ అంటున్నారు. ఇక మిగిలిన ఇద్ద‌రు హ‌మీదా, స‌ర‌యు. వీళ్లిద్ద‌రు హౌజ్‌లో ఉన్నా కూడా లేన‌ట్టే అనిపిస్తుంది. వారి పెర్ఫార్మెన్స్ కూడా ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రిలో నుండి ఒక‌రిని బ‌య‌ట‌కు పంప‌నున్నార‌నే ప్ర‌చార గ‌ట్టిగా జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement