Friday, April 26, 2024

బిగ్‌బాస్-5 ప్రోమో వచ్చేసింది.. అదరగొట్టిన నాగ్

ఏ భాషలో అయినా బిగ్‌బాస్ రియాలిటీ షోకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇక తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ త్వరలోనే ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా బిగ్‌బాస్-5 తెలుగు ప్రోమోను స్టార్ మాటీవీ విడుదల చేసింది.

ఈ ప్రోమోలో హోస్టుగా వ్యవహరించనున్న అక్కినేని నాగార్జున తన డాన్స్, డైలాగులతో అందరినీ అలరించారు. ‘బోర్ డంకు గుడ్ బై చెప్పండి. వచ్చేస్తుంది బిగ్ బాస్ 5’ అంటూ ఓ గన్ పట్టుకుని డైలాగు విసిరారు. త్వరలోనే బిగ్ బాస్ 5 ప్రారంభం కానున్నట్లు నాగ్ పేర్కొన్నాడు. ప్రోమోతో బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. కాగా బిగ్ బాస్ 5 సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎవరెవరు రాబోతున్నారన్న విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్ లాంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

https://twitter.com/StarMaa/status/1426526778294628352
Advertisement

తాజా వార్తలు

Advertisement