Tuesday, April 23, 2024

బాంబే ఐఐటీ ప్లేస్ మెంట్స్ లో భారీ ఆఫర్ .. రూ.2.05 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం

ప్ర‌భ‌న్యూస్ :బాంబే ఐఐటీ విద్యార్థుల ప్లేస్ మెంట్స్ కోసం కాంపస్ సెలక్షన్స్ ప్రారంభించిన తొలిరోజే చెప్పుకోదగ్గ ప్యాకేజీతో అవకాశాలు దక్కాయి. ప్రత్యేకించి ఇద్దరు విద్యార్థులకు ఉబర్ మంచి ఆఫర్ లు ఇచ్చింది. ఓ విద్యార్థికి 2.05 కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉబర్ ఉద్యోగానికి ఎంపిక చేసింది. అలాగే దాదాపు 1.4 కోటి రూపాయల వార్షిక వేతనంతో రుబ్రిక్ సంస్థ మరో విద్యార్థికి అవకాశం ఇచ్చింది.

ఏటా రెండుసార్లు ప్లేస్ మెంట్ సెషన్లు నిర్వహించే బాంబే ఐఐటీ మలివిడత సెషన్ నిర్వహించిది. 28 కంపెనీలు పాల్గొన్న ఈ సెషన్ లో తొలి రోజే మంచి ఆఫర్లను విద్యార్థులు అందిపుచ్చుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు, కన్సల్టెంట్ సంస్థలు ఈ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నాయి. దాదాపు 201 మందికి వివిధ స్థాయిల్లో అవకాశాలు రాగా కనీస వార్షిక వేతనం రూ.46 లక్షలుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement