Friday, April 19, 2024

Big House: హ్యుమానిటీ.. కంటెస్టెంట్ల మ‌ధ్య త్యాగాలు.. క‌న్నీళ్లు!

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ హౌస్‌లో నామినేషన్ ప్రక్రియలో కొంచెం నీరు.. కొంచెం నిప్పు అన్న‌ట్టుగా సాగింది. ఇంటి సభ్యుల‌ భావోద్వేగాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈవారం నామినేషన్ ప్రక్రియ గత వారాల కంటే కాస్త భిన్నంగా జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి తమ కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెట‌ర్స్‌ని ఎవరైతే తీసుకుంటారో ఆ ఇంటి సభ్యుడు ఈ వారం నామినేషన్ నుండి బయటపడుతాడు.

అయితే ఈ ప్రక్రియలో ఇద్దరు ఇంటి సభ్యులు పవర్ రూమ్ కి వెళ్లి బిగ్ బాస్ ఇచ్చిన లెటర్స్ బ్యాగ్ నుండి ఇద్దరు హౌస్ మేట్స్ కి సంబంధించిన రెండు లెటర్స్ లో ఏ ఇంటి సభ్యుడికి అయితే ఇస్తారో ఆ కంటెస్టెంట్ ఆ లెటర్ ని పొందటమే కాకుండా ఈ వారం నామిషన్ నుండి బయటపడుతారని బిగ్ బాస్ ప్ర‌క‌టించాడు..

ఇక ఈ ప్రక్రియలో మొదటగా శ్రీరామచంద్ర, మానస్ పవర్ రూమ్ కి వెళ్లి ప్రియాంక సింగ్, లోబోల లెటర్స్ ని తీసుకొచ్చారు. అందులో లోబో – ప్రియాంక సింగ్ కి లెటర్ ఇవ్వమనడం.. ప్రియాంక కూడా తన తల్లిదండ్రుల నుండి వచ్చిన లెటర్ తనకి కావాలని చెప్పడంతో మానస్, శ్రీరామ్ కలిసి ప్రియాంక సింగ్ కి లెటర్ ఇచ్చారు.

ఆ తరువాత ప్రియాంక సింగ్ – కాజల్ పవర్ రూమ్ నుండి తెచ్చిన లెటర్ బాక్స్ లో మానస్ – ఆనీ మాస్టర్ లెటర్స్ ఉండటంతో మానస్.. ఆనీ మాస్టర్ కోసం తన లెటర్ ని వదులుకొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement