Friday, April 19, 2024

ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల‌కు బిగ్ గిఫ్ట్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డేకి ‘జ‌ల్సా’ రీ-రిలీజ్

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ సినిమాల‌లో జ‌ల్సా ఒక‌టిగా నిలిచింది. సంజ‌య్ సాహుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌రైజేష‌న్‌, డైలాగ్ డెలివ‌రీతో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి అభిమానుల‌ను అల‌రించారు. ప్రేమ‌క‌థ‌కు యాక్ష‌న్, కామెడీని జోడించి.. మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. త్రివిక్ర‌మ్ మేకింగ్‌, టేకింగ్ స్టైల్‌కు ప‌వ‌న్ ఇమేజ్ తోడ‌వ్వ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా కాసుల వ‌ర్షం కురిపించింది. జల్సా విడుద‌లై 14 ఏళ్లు పూర్త‌యిన సినిమాలోని పాట‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటాయి.

కాగా, వ‌చ్చే నెల (సెప్టెంబ‌ర్) 2న ఈ సినిమాను రీ-రిలీజ్ చేయ‌బోతున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌ల్సా సినిమా మ‌రోసారి థియేట‌ర్ల‌లో అడుగు పెట్ట‌నుంది. ఒరిజినల్ ప్రింట్ ను క్యూబ్‌, 4 కే వెర్ష‌న్స్ లోకి మార్చి రీ రిలీజ్ చేయ‌నున్నారు. జ‌ల్సా సినిమాకు సంబంధించిన రీరిలీజ్‌, ప్ర‌మోష‌న్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కొంద‌రు ఆర్గ‌నైజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఏపీతో పాటు తెలంగాణ‌లోని ప‌లు థియేట‌ర్ల‌లో ఈ సినిమా స్క్రీనింగ్ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తున్నారు. పీరియాడిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ సినిమా చేయ‌బోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement