Thursday, March 28, 2024

ఆస్ట్రేలియాలో భారీ డైనోసార్‌..!

జురాసిక్ యుగంలో డైనోసార్స్ జీవించి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత డైనోసార్స్ వివిధ కార‌ణాల వ‌ల‌న అంత‌రించిపోయాయి. వాటికి సంబంధించిన శిలాజాలు అప్పుడ‌ప్పుడు అక్క‌డ‌క్క‌డ బ‌య‌ట‌ప‌డుతుంటాయి. ఇలానే అస్ట్రేలియాలో ఒ డైనోసార్‌కు సంబందించిన ఎముక దొరికింది.  దానిని ఆ శిలాజాన్ని ఉప‌యోగించుకొని 3డి ఎముక‌ను త‌యారు చేశారు అస్ట్రేలియా శాస్త్ర‌వేత్త‌లు.  ఆ 3డి ఎముక‌ను బేస్ చేసుకొని డైనోసార్ జాతిని గుర్తించారు. 92 నుంచి 96 మిలియ‌న్ సంవ‌త్సారాల క్రితం భూమిపై నివ‌శించిన సౌర‌పోడ్ జాతికి చెందిన డైనోసార్ గా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.  ఇవి 5 నుంచి ఏడు మీట‌ర్ల వ‌ర‌కు ఎత్తు, 25 నుంచి 30 మీట‌ర్ల వెడ‌ల్పు ఉండేవ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. ఇవి పూర్తిగా శాఖాహారుల‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement