అనంతపురం జిల్లాలో కరెంట్ వైర్లే యమపాశాలుగా మారాయి. జిల్లాలోని బొమ్మనహళ్ మండలం దర్గా హొన్నూరులో పొలంలో పనిచేస్తున్న కూలీలపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కూలీలు వారికి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -