Thursday, April 25, 2024

ఆదిపురుష్ కోసం.. వైష్ణోదేవి ఆల‌యంలో ప్రత్యేక‌పూజ‌లు

జ‌మ్మూక‌శ్మీర్ లోని వైష్ణోదేవి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపారు బాలీవుడ్ డైరెక్ట‌ర్..నిర్మాత‌.. ఓం రౌత్‌, భూషణ్‌ కుమార్‌ కలిసి వైష్ణోదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఆదిపురుష్ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకున్నట్లు తెలిపారు. మైథలాజిక‌ల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ మూవీని 2023 జ‌న‌వరి 16న సంక్రాంతి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతంలో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ కృతిస‌న‌న్ సీత పాత్రలో న‌టిస్తుండగా … సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడిగా నటిస్తున్నారు. స‌న్నీ సింగ్ లక్ష్మణుడిగా.. దేవ్‌ద‌త్తా న‌గే హ‌నుమంతుడి పాత్రలో న‌టిస్తున్నారు.ఆది పురుష్ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి సాచెట్‌-ప‌రంప‌ర సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement