Tuesday, April 23, 2024

భోగి వేడుకల్లో డ్యాన్స్ చేసిన అంబ‌టి రాంబాబు

భోగి వేడుక‌ల్లో పాల్గొన్నారు వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. ఈ సంద‌ర్భంగా స‌త్తెన‌ప‌ల్లిలో నిర్వ‌హించిన భోగి వేడుక‌ల్లో అంబ‌టి డ్యాన్స్ చేసి అందరినీ అల‌రించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలకు అనుగుణంగా గిరిజన మహిళలతో ఉత్సాహంగా కాలు కదిపారు. భోగి పండుగ నాడు అందరి మధ్య సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని అంబటి రాంబాబు తెలిపారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement