Thursday, September 23, 2021

భీమ్లా నాయక్@ 20 మిలియన్ వ్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ పాట 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సంపాదించుకుంది. తమన్ మన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేక్ గా భీమానాయక్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించనున్నారు. మరో ప్రధానమైన పాత్రలో రానా నటిస్తుండగా, కథానాయికలుగా నిత్యామీనన్ – ఐశ్వర్య రాజేశ్ అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News