Wednesday, April 24, 2024

ఇవాళ భవానీపూర్‌ ఉపఎన్నిక ఫలితం..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్‌ ఉపఎన్నిక ఫలితం ఇవాళ వెలువడనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భవానీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించారు. 24 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. ఈ ఉపఎన్నికలో దీదీ గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోలుగుతారు. దీంతో ఉపఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సెప్టెంబరు 30న భవానీపూర్ ఉప ఎన్నిక జరగ్గా 57 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమత మళ్లీ ఎన్నిక కావడం అనివార్యమైంది. దీంతో భవానీపూర్ నుంచి ఎన్నికైన టీఎంసీ నేత శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేసి మమత పోటీకి అవకాశం కల్పించారు. ఇక్కడి నుంచి మమత ప్రత్యర్ధిగా బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మంత్రి కేటీఆర్ కారును ఆపేసిన పోలీసులు!

Advertisement

తాజా వార్తలు

Advertisement