Friday, April 19, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు : మంత్రి హ‌రీశ్ రావు

నేను రాను బిడ్డ సర్కారు దావఖానకి అనే రోజులు పోయి.. ప్రభుత్వ ఆసుపత్రి లోనే వైద్యం కావాలి అనే రోజులు వచ్చాయ‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ.. సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయ‌ని, దసరా నాటికి వైద్య సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నామ‌న్నారు. పేదలకి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అన్నారు. దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఈ ఆసుపత్రిలో అందనున్నాయ‌న్నారు. నిధుల కు కొరత లేదు, 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement