కార్తికేయ చిత్రానికి ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో హీరో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డును నిఖిల్ అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నిఖిల్.. సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘హే కేశవ.. హే మాధవ.. హే గోవిందా’ పాటను జోడించి పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్.. నిఖిల్‌కు అభినందనులు చెబుతున్నారు. కార్తికేయ సిరీస్‌లో మూడో భాగం ఉంటుందా? అని నిఖిల్‌ను ప్రశ్నించగా, ‘కచ్చితంగా ఉంటుంది. సాహసాలను, సమస్యలను , మిస్టరీలను ఛేదించే ఉత్సాహం ఉన్న డాక్టర్ కార్తీక్ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. మన దేశ సంస్కృతిలో ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని భాగాలతో మీ ముందుకు వస్తాం అని నిఖిల్ చెప్పుకొచ్చారు.
- Advertisement -