Wednesday, April 24, 2024

బెంగళూరు కొడగు జిల్లాలో వారంలో ఐదు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌..

కొడగు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున వారంలో ఐదు రోజులపాటు సంపూర్ణంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. వారంలో ఐదు రోజులు సంపూర్ణంగా బంద్‌ పాటించి చివరి రెండు రోజులు నిత్యావసరాలకు నిబంధనలతో కొనుగోళ్లకు అవకాశం కల్పించారు. హోం స్టేలు, దుకాణాలు అన్నీ మూసివేసేలా ఆదేశించారు. అనవసరంగా రోడ్డెక్కితే వాహనాలు సీజ్‌ చేయాలని పోలీసులకు సూచించారు. ప్రజలు కూడా ఇందుకు సహకరిస్తేనే కొవిడ్‌ నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా యంత్రాంగం పేర్కొం ది. తీవ్రరూపం దాలుస్తున్న కొవిడ్‌ నియంత్రణకు ఇదొక్కటే మార్గంగా ఉందని ప్రజలు అనవసరంగా బయటికి రావదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement