Friday, April 19, 2024

సువేందు సోదరులపై చోరీ కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు

పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికరిపై బెంగాల్ పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. పూర్బ మేదినిపూర్ జిల్లా కాంతి మున్సిపాలిటీ కార్యాలయంలో సహాయ సామగ్రి (రిలీఫ్ మెటీరియల్) బలవంతంగా ఎత్తుకెళ్లారనే ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సువేందు సోదరులపై కేసు నమోదు చేశారు. జూన్ 1వ తేదీన కాంతి పోలీసు స్టేషన్‌లో రత్నదీప్ మన్నా ఫిర్యాదు చేశారు. మే 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సువేందు అధికారి, ఆయన సోదరుడు, కాంతి మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చీఫ్ సౌమేందు అధికారి ఆదేశాల మేరకు అక్రమంగా మున్సిపాలిటీ గోదాము తాళాలు తెరిచి, సామగ్రిని చోరీ చేసినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ సహాయ సమగ్రి విలువ లక్షలాది రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. సాయుధ కేంద్ర బలగాలను ఉపయోగించుకుని బీజేపీ నేతలు బలవతంగా ఈ సహాయ సామగ్రి ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement