Thursday, April 25, 2024

ఇద్దరు కేంద్ర మంత్రులకు అరెస్ట్​ వారెంట్​.. పాత కేసుల్లో కోర్టుకు రాకుండా తప్పించుకుతిరగడమే కారణం!

పశ్చిమ బెంగాల్‌లోని తుఫాన్‌గంజ్ జిల్లా కోర్టు శుక్రవారం కేంద్ర మంత్రి జాన్ బార్లాపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కారం కింద ఈ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 2019కి సంబంధించి ఓ కేసులో జాన్ బార్లా అనేకసార్లు కోర్టుకు గైర్హాజరయ్యారు. కోర్టు పదే పదే నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

2019లో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టినందుకు జాన్ బార్లాతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 15న కోర్టుకు హాజరుకావాలని మంత్రిని కోరినప్పటికీ ఆయన హాజరుకాలేదు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు ఇట్లా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్‌పై అలీపుర్‌దువార్‌లోని కోర్టు.. నవంబర్ 11న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 13 ఏళ్ల నాటి దోపిడీ కేసుకు సంబంధించి మంత్రికి ఈ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement