Thursday, March 28, 2024

సమంత స్పెషల్ నోట్.. వైరల్ గా వీడియో

ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటోంది స్టార్ హీరోయిన్ సమంత.కాగా తాజాగా తన వర్కవుట్స్ వీడియో షేర్ చేస్తూ.. స్పెషల్ నోట్ రాసుకొచ్చింది. లావుగా ఉన్న మహిళ ఇది చేసేవరకు ముగియదు. ముఖ్యంగా @whoisgravity స్పెషల్ థాంక్స్. మీరు నాకు కొన్ని కఠినమైన రోజులలో స్పూర్తిని ఇచ్చారు. బలం అంటే మనం తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ ఫుడ్ కాదు.. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం అంటూ రాసుకొస్తూ.. వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే త్వరలోనే సామ్.. డైరెక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రం షూటింగ్ లో పాల్గొననుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement