Friday, April 19, 2024

విలేజ్ డ్రామెడీ ‘బెదురులంక’ మూవీ షూటింగ్ పూర్తి..

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా డీజే టిల్లు ఫేమ్‌ నేహా శెట్టి కథానాయికగా తెరకెక్కనున్న సినిమా ‘బెదురులంక 2012’.క్లాక్స్‌ దర్శకత్వంలో లౌక్య ఎంటర్‌-టైన్‌ మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నంబర్‌ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సి. యువరాజ్‌ సమర్పకులు.
ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఇటీ-వల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మార్చి లో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు- చిత్ర నిర్మాతలు తెలిపారు.


కొద్దిరోజుల క్రితం వరల్డ్‌ అఫ్‌ బెదురులంక అని విడుదల చేసిన చిత్ర గ్లింప్స్‌ వీడియో సినిమాపై భారీ అంచనాలని పెంచగా త్వరలో ఆసక్తికరమైన టీ-జర్‌ ని విడుదల చేయనున్నారు.కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌ కసి రెడ్డి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌ ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, , సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్‌ గున్నల, సమర్పణ: సి. యువరాజ్‌, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement