Thursday, April 18, 2024

ప్రేక్ష‌కుల‌ను ధియేట‌ర్స్ కు రప్పించే చిత్రం..

యువ హీరో కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్‌ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి. యువరాజ్‌ చిత్ర సమర్పకులు. క్లాక్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో ఈ సినిమా టీ-జర్‌ విడుదల చేశారు. అలాగే, మీడియా కోసం ఏర్పాటు- చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం మాట్లా డింది. హీరో కార్తికేయ మాట్లాడుతూ ” ష్యూర్‌ షాట్‌ హిట్‌ అయ్యే స్క్రిప్ట్‌ కోసం చూస్తున్న సమయంలో క్లాక్స్‌ చెప్పిన కథ విన్నాక ఇటు-వంటి కథ కోసమే వెయిట్‌ చేస్తున్నానని అనిపించింది. ఎటు-వంటి లెక్కలు వేసుకోకుండా ఈ కథ చెప్పాలని, ఈ కథలో నేనూ పార్ట్‌ అవ్వాలని అనిపించింది. ప్రేక్షకులు అందరినీ థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనే కారణంతో చేశా. ఈ సినిమా మాట్లాడుతుంది. బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది.” అని అన్నారు.


దర్శక రచయిత, నటు-డు బీవీఎస్‌ రవి మాట్లాడుతూ ” నాకు బెదురులంక 2012 కథ తెలుసు. విన్న వెంటనే ఇం-టె-స్టింగ్‌ గా ఉంది. చాలా మంచి సినిమా అవుతుంది ” అని అన్నారు.
నేహా శెట్టి మాట్లాడుతూ ”ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత బెన్నీ గారు, దర్శకుడు క్లాక్స్‌ గారికి థాంక్స్‌. బెదురులంక 2012లో నా క్యారెక్టర్‌ చిత్రను కూడా ప్రేమిస్తారు.” అని అన్నారు. నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ”సినిమా బాగా వచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ సహా అ న్ని కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటి స్తాం.” అని అన్నారు. చిత్ర దర్శకుడు క్లాక్స్‌ మాట్లాడుతూ ” నిజాయతీగా చేసిన ప్రయత్నం ఇది. నటీ-నటు-లు అందరూ సపోర్ట్‌ చేశారు. పదేళ్ళ క్రితం నుంచి ఈ కథను చెబుదామని అనుకుంటు-న్నా. ఓటీ-టీ-లకు ఆదరణ పెరిగిన తర్వాత ప్రేక్ష కులు కొత్త కం-టె-ంట్‌ కూడా చూస్తారని నమ్మకం మాకు పెరిగింది. అకిరా కురు సోనా సెవెన్‌ సమురాయ్‌లో ఓ డైలాగ్‌ స్ఫూర్తితో ఈ కథ రాశాను” అని చెప్పారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement