Thursday, April 25, 2024

ఇంట్రెస్టింగ్ గా బెదురులంక 2012.. మోష‌న్ పోస్ట‌ర్

యంగ్ హీరో కార్తికేయ న‌టిస్తోన్న తాజా చిత్రం బెదురులంక 2012.ఈ చిత్ర‌ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.ఈ పోస్టర్ లో కార్తికేయ చాలా స్టైలీష్ లుక్ తో కనిపిస్తున్నారు. ‘వచ్చాడ్రా .. శివుడొచ్చాడ్రా’ అనే ఒక నినాదం వంటి కోరస్ పై ఈ మోషన్ పోస్టర్ ను వదిలారు. రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, నేహా శెట్టి కథానాయికగా కనిపించనుంది. మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన తీరు కొత్తగానే ఉందిగానీ, కాన్సెప్ట్ ఏమిటనేది అంచనాలకి అందడం లేదు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement