Saturday, October 12, 2024

మీడియా ముందు నోరు జాగ్రత్త.. నేతలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా హితవు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చినపుడు చాలా సంయమనం పాటించాలని, వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు. రెండు రోజుల సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా ఆదివారం అయిదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై జరిగిన చర్చ సందర్భంగా సోనియా జోక్యం చేసుకుని మీడియా సమావేశాల సందర్బంగా నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని, లేదంటే పొరపాటుగా చేసే చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఖ్యత, క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని, ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలోనే ఎందుకు చేరారు..? ఖర్గేను ప్రశ్నించిన రాహుల్‌

- Advertisement -

సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఎందుకు చేరారని రాహుల్‌ ఖర్గేను ప్రశ్నించినట్లు సమాచారం. పేదలు, అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాలు, పీడీత వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీ కేవలం కాంగ్రెస్‌ మాత్రమేనని అందుకే ఈ పార్టీలో చేరానని ఖర్గే సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.

భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ పార్టీ దిశానిర్దేశం చేసిందని, భరతమాత కష్టాలను యాత్ర ప్రతిధ్వనించిందని ఆ యాత్ర ఆధారంగానే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యారంటీలను రూపొందించామని పేర్కొన్నారు. భాజపా అసంబద్ధ అంశాల వలలో చిక్కుకోవద్దని రాహుల్‌ గాంధీ తమను హెచ్చరించినట్లు ఖర్గే తెలిపారు. రాహుల్‌ నుంచి పార్టీకి, కార్యకర్తలకు స్పష్టత వచ్చిందని, భారత్‌ జోడో రెండో విడత యాత్రపై చర్చ జరిగిందని తెలిపారు. యాత్రపై రాహుల్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement