Monday, March 18, 2024

ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్లు జరిమానా విధించాలి

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఐపీఎల్-2021 సీజన్‌ను నిర్వహించిన బీసీసీఐకి రూ.1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో ఓ పిటీషన్‌ దాఖలైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారత్‌లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ 14వ సీజన్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది.

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ 2021ను నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐకి రూ.1000 కోట్ల ఫైన్‌ వేయాలని పిటీషన్‌లో కోరారు. అలాగే ఐపీఎల్‌ 2021 ద్వారా వచ్చే లాభాలను కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా కోసం ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని వారు కోరారు. ఇక డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జిఎస్ కులకర్ణి గురువారం ఈ విషయాన్ని విచారించడానికి అంగీకరించారు. మరి బాంబే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement