Friday, March 29, 2024

నాగ్‌పూర్‌ పిచ్‌ డీమెరిట్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్‌

ఇండోర్‌ టెస్ట్‌ పేలవమైన పిచ్‌ రేటింగ్‌పై ఇంటర్‌నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌కు బీసీసీఐ అప్పీల్‌ చేసింది. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పరిధిలో ఇండర్‌ హూల్కర్‌ స్టేడియానికి చెందిన అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఐసీసీకి చెందిన ఇద్దరు సభ్యుల ప్యానెల్‌ ఈ విషయంపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నది. 14 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగిన టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో ఒకే రోజు బౌలర్లు దాదాపు 30 వికెట్లు కూల్చారు. బౌలర్లు మొత్తం 31 వికెట్లు కూల్చగా, 26 వికెట్లను స్పిన్‌ బౌలర్లే తీశారు. ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇండోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్‌ పేలవంగా ఉందంటూ మొదటి రోజు నుంచే విమర్శలు వచ్చాయి. మ్యాచ్‌ రిఫరీ బ్రాడ్‌ తన నివేదికలో ‘పిచ్‌ చాలా పొడిగా ఉంది. తొలి నుంచి స్పిన్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంది.

పిచ్‌ మ్యాచ్‌ మొత్తం అధిక, అసమాన బౌన్స్‌ ఉంది’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐసీసీ పేలవమైన పిచ్‌ అంటూ మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. ఏదైనా వేదిక ఐదేళ్ల రోలింగ్‌ వ్యవధిలో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ డీ మెరిట్‌ పాయింట్లను పొందినట్లయితే 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement