Friday, March 29, 2024

పోయిరావమ్మా.. గౌరమ్మ

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  • తీరొక్క పూలతో బతుక్మను పేర్చిన మహిళలు
  • ఆకట్టుకున్న యువతుల కోలాటాలు
  • హుజూరాబాద్‌లో సందడి చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి
  • ఏర్పాట్లు చేసిన అధికారులు
    తెలంగాణ ఆడపిల్లల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బుధవారం ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మకు మహిళలు పూజలు చేశారు. బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. హుజూరాబాద్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్‌, మెదక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం పోయిరావమ్మా గౌరమ్మ అంటూ నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు.

హుజురాబాద్‌, అక్టోబర్‌ 12 (ప్రభన్యూస్‌) : హుజురాబాద్‌ పట్టణంలో బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా జరు పుకున్నారు. పట్టణంలో ని చిలక వాగు వద్ద వేడుకలు నిర్వ హించారు. మున్సిపాలిటీ- పరిధిలోని మహిళలు పెద్ద సం ఖ్య లో పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో ని మహిళలు ఒకే వేదిక వద్దకు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కాగా బతుకమ్మ వేడు కల్లో భాగంగా బతుకమ్మ ల తో పాటు- గ్యాస్‌ సిలిండర్‌ లు పెట్టి బతు కమ్మ పాటల తో మహిళలు పాల్గొన్నారు. పెరిగిన ధర లకు సూచికగా నిర్వాహకులు సిలిండర్‌ బొమ్మలు ఏర్పాటు- చేశారు. వేడుకల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి బతు కమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల తో కలసి ఉత్సా హం గా పాల్గొన్నారు. కాగా కొత్తపల్లి లో ప్రత్యేకంగా ఏర్పాట్లు- చేసి వేడుకలు నిర్వహించారు. మండలం లోని అన్ని గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గాంధే రాధిక, వైస్‌ చైర్మన్‌ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, రమాదేవి, ప్రతాప మంజుల ు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకల్లో పోటీ అభ్యర్ధులు
హుజురాబాద్‌ ఉప ఎన్నికల బరిలో ఉన్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధి భలమురి వెంకట్‌ లు బతుకమ్మ వేడుకల్లో పాల్గోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
సైదాపూర్‌లో..
మండల కేంద్రంతోపాటు- వెన్కేపల్లి,ఎఖ్లాస్‌ పూర్‌ తదితర గ్రామాలలో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘన ంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినిల తోపాటు- పెద్దలు,పిల్లలు అనే తేడా లేకుండా సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మల నిమజ్జనానికి గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లైటింగ్‌ ఏర్పాటు-చేసి మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకునే ఏర్పాట్లు- చేశారు.బతుకమ్మల ను గ్రా మ శివారులోని చెరువులలో నిమ్మజనం చేసిన తర్వాత మహి ళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు.మండలం లోని మిగతా గ్రామాలలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి.
చిగురుమామిడిలో..
మండలంలో పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం దత్తత గ్రామం చిన్న ముల్క నూ రు మినహా అన్ని గ్రామాలలో మహిళలు పలు రకాల పూలతో బ తు కమ్మల ను ఉదయం నుండి పేర్చి సాయంకాలం చావడి ల వద్ద బతుకమ్మ ఆటలు అడి ఘనంగా మహిళలు కోలా టా లతో సంబరాలు జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.శరన్నవరాత్రి నుండి ప్రారంభమయిన బతుకమ్మ వేడుకలు సద్దుల బతు కమ్మ వేడుక లతో బతుకమ్మ పండుగ సంబరాలు ముగి శాయి . చిగురుమామిడి లో ఎంపీపీ కొత్త వినిత పాల్గొన్నారు. బతుకమ్మల నిమజ్జనానికి గ్రామ పంచాయతీ పాలక వర్గాలు అన్ని గ్రామ పంచాయతీల లో లైటింగ్‌ ఏర్పాటు-చేసి మహి ళలు బతుకమ్మ సంబరాలు జరుపుకునే ఏర్పాట్లు- చేశారు .బతుకమ్మల ను గ్రామ శివారులోని చెరువులలో నిమ్మజనం చేయడంతో ప్రసాదాలను ఇచ్చు పుచ్చుకున్నారు బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరు గకుండా ఎస్‌ఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు ఇందుర్తి లో లక్ష్మీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యం లో బతుకమ్మలకు బహుమతులు అందజేశారు.
చొప్పదండిలో..
తెలంగాణలో అతి పెద్ద మహిళ పండుగైన సద్దుల బతుకమ్మ వేడుకలు బుధవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ఘ నంగా జరిగాయి. ఈ మేరకు తీరొక్క పూలతో బతు కమ్మ లను పేర్చి మహిళలు కొత్త బట్టలు ధరించి బతుకమ్మ పా ట లతో చప్పట్లు కొడుతు, డిజె పాటలతో కోలాటలాడుతు అ త్యం త అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పలు కూ డల్ల లో ఏర్పాటు చేసిన వేదికల వద్దకు పెద్ద ఎత్తున మహిళలు బ తుకమ్మలతో తరలి వచ్చి ఆట పాటలతో ఆలరించారు. చొప్ప దండి ఎమ్మెల్యే సతీమణి సుంకె దీవెన, మున్సిపల్‌ చైర్‌ పర్స న్‌ గుర్రం నీరజ, మహిళా కౌన్సిలర్లు బతుకమ్మ ఆట ఆడి పా డారు. అనంతరం బతుకమ్మలను కుడిచెరువు, చెనుక్కుంట, బ్రాహ్మ ణకుంట, డి-86 కాలవలో నిమజ్జనం చేశారు. చొ ప్పదండి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

  • తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ : కలెక్టర్‌ జి.రవి
    జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్‌ 13, (ప్రభ న్యూస్‌): జగిత్యాల పట్టణంలో బతు కమ్మ సంబరాలు అంబురన్నంటాయి. జగిత్యాల మున్సిపల్‌ ఆధ్వర్యంలో మహాబతుకమ్మ ఏర్పాటు చేయగా జడ్పి చైర్‌పర్సన్‌ ఊరేగింపును ప్రారంభించా రు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి చిన్నారులకు, మెప్మా సిబ్బంది బహుమతులు అందిం చారు. మహా బతుకమ్మ ఉత్సవాల్లో వైశ్య భవన్‌ నుండి పురపాలక సంఘం వరకు కోలాటాలు, నృత్యాలతో తీసుకవచ్చి మున్సిపల్‌ ఆవరణలో బతుకమ్మ పం డుగను సంబురంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ గుగులోతు రవి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలం గాణ సంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకని, భవిష్యత్తు తరాలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అందించా ల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డా. బోగ శ్రావణి మాట్లాడుతూ తెలంగాణ పూలపండుగ బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసిన ఘన త ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దక్కు తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా తెలంగాణ పండుగలను పట్టించు కోలేదని, సీఎం కేసిఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగా బతుకమ్మను గుర్తించి నిధులు కేటాయించి అధికారికంగా బతు కమ్మ పండుగను నిర్వహిస్తున్నారన్నా రు. మహిళలకు ఎంతో ఇష్టమైన పండు గ బతుకమ్మ అని అన్నారు. మున్సిపల్‌ మహాబతుకమ్మను పురవీధుల గుండా వెంట శోభయాత్ర ఘనంగా నిర్వహించి మినీ ట్యాంక్‌ బండ్‌ చింతకుంట చెరువు లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఆర్డి వో మాధురి, కోరుట్ల, మెట్‌పల్లి మున్సి పల్‌ చైర్‌పర్స న్లు అన్నం లావణ్య, రాణ వేణి సుజాత, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సి పల్‌ అధికారులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement