Monday, April 15, 2024

బ్యాంకు అధికారులకు ఏడేళ్ల జైలు శిక్ష.. నకిలీ ఖాతాలకు నిధులు మళ్లించిన కేసులో కోర్టు తీర్పు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బ్యాంకును మోసగించిన కేసులో ‘బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర’ అధికారులకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సికింద్రాబాద్ బ్రాంచ్‌లో అప్పటి సీనియర్ మేనేజర్‌గా జెల్లి శరత్ బాబు, ఏజీఎం సుహాస్ కళ్యాణ్ రాందాసికు ఏడేళ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ. 1.1 లక్ష జరిమానా విధించినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై నకిలీ ఖాతాలకు రూ. 5 కోట్లు మళ్లించిన అభియోగాలపై సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసి బ్యాంకు అధికారులను దోషులుగా తేల్చింది. ఇందులో బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన ప్రైవేట్ వ్యక్తులు డి. శ్రీధర్, డి. పూర్ణశ్రీ, ఎం. శ్రీనివాస రెడ్డికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా, ఇదే కేసులో మరికొందరు దోషులకు ఏడాది కఠిన కారాగార శిక్ష పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement