Tuesday, April 16, 2024

సార్ చిత్రం నుండి.. బంజారా లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం సార్..ఈ చిత్రంలో హీరోగా ధ‌నుశ్ న‌టించ‌గా.. హీరోయిన్ గా సంయుక్త మీనన్ అలరించనుంది.తమిళంలో ఈ సినిమాకి ‘వాతి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. తెలుగు .. తమిళ భషాల్లో ఒకే రోజున విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. సితార నాగవంశీ .. సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘బంజారా’ అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇల్లేనాదని .. వాకిలి నాదేనంటే ఫక్కున నవ్వుతాది భూ తల్లి’ అంటూ ఈ పాట మొదలవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement