Thursday, March 28, 2024

Followup | టీమిండియాపై బంగ్లా గెలుపు.. ఇండియా 186 ఆలౌట్‌

బంగ్లాదేశ్‌ టూర్‌లో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతున్న భారత్‌ తొలి వన్డేలో పరాజయం చెందింది. టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బంగ్లా జట్టు నుంచి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మెహదీ మిరాజ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడడంలో బంగ్లా ఒక వికెట్‌ తేడాతో గెలిచింది. భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత వన్డేలో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. భారత్‌దే మ్యాచ్‌ అనుకున్న సమయంలో మెహిదీ హసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో బంగ్లాను గెలిపించాడు. ఒత్తిడి తట్టుకుంటూ మిరాజ్‌ 38 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అతనికి ముస్తాఫిజుర్‌ సహకారం అందించాడు. స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో బంగ్లాదేశ్‌ ఓపెనర్లు , మిడిలార్డర్‌ బ్యాటర్లు తడబడ్డారు. బౌలింగ్‌లో , బ్యాటింగ్‌లో రాణించి జట్టును గెలిపించారు.

ఈ విజయంతో బంగ్లాదేశ్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన మెహదీ మిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు. రెండో వన్డే ఏడోతేదీన జరగనుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ భారత జట్టుపై విజయం సాధించింది. భారత్‌పై బంగ్లాకు ఇది ఆరో విక్టరీ. భారత్‌ బ్యాటర్‌లు తొలి వన్డేలో తీవ్రంగా నిరుత్సాహపరిచారు. కెఎల్‌ రాహుల్‌ (73) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 11వ ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ 3 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కెఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసిన కాసేపటికే శ్రేయాస్‌ కూడా పెవిలియన్‌ బాటపట్టాడు.

- Advertisement -

ఆ తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ కాసేపు కెఎల్‌ రాహుల్‌కు జతగా నిలిచాడు. కానీ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుందర్‌ ఔట్‌ అయ్యాడు. సుందర్‌ ఔటైన తర్వాత షాబాజ్‌ అహ్మద్‌, శార్దూర్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ వరుసగా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. దాంతో భారత్‌ 34.4 ఓవర్లలో భారత్‌ 8 వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులకు చేరింది. ఆ తర్వాత భారాన్నంతా తనపై వేసుకున్న కెఎల్‌ రాహుల్‌ ఊపుగా ఆడుతూ జట్టు స్కోరు 178 ఉన్నప్పుడు ఔటయ్యాడు. టీమిండియా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో పరుగులు చేయడానికి బంగ్లాదేశ్‌ బ్యాటర్లు తీవ్రంగా కష్టపడ్డారు. రెండు నుంచి నాలుగు ఓవర్ల మధ్య 10 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. 5 ఓవర్లకు బంగ్లా15/1 స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

తొలి ఓవర్‌లోనే షాక్‌

187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. తొలి బంతికే ఓపెనర్‌ నజ్ముల్‌ హోసేన్‌ శాంటో ఔట్‌ అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో అతను నిరాశగా వెనుదిరిగాడు. దీపక్‌ చాహర్‌ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. టార్గెట్‌ను చేధించే క్రమంలో బంగ్లాదేశ్‌ 9 వికెట్లు కోల్పోయింది. లిటన్‌ దాస్‌ (41) అనాముక్‌ హక్‌ (14) పెవిలియన్‌కు చేరిన తర్వాత మిడిలార్డర్‌ బ్యాటర్లు షకిబుల్‌ , ముష్పికర్‌ రహీం నిలకడగా ఆడారు. అయితే షకిబుల్‌ను ఔట్‌ చేసి వాషింగ్టన్‌ సుందర్‌ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. దాంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. మహమ్మద్‌ సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. యువ బౌలర్‌ కుల్దిప్‌ సేన్‌ అరంగ్రేటం మ్యాచ్‌లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్‌ సుందర్‌ 2, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ లిట్టన్‌దాస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. బంగ్లా బౌలర్లు కట్టు దిట్టంగా బంతులు వేయడంతో భారత జట్టును 186 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియాలో కెఎల్‌ రాహుల్‌ 74 ఒక్కడే రాణించాడు. విరాట్‌ కోహ్లీ 9, ధావన్‌ 7, శ్రేయాస్‌ అయ్యర్‌ 24 పరుగులు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆల్‌ రౌండర్‌ షకిబుల్‌ హసన్‌ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. రోహిత్‌ శర్మ, కోహ్లీలను ఔట్‌ చేశాడు. పేసర్‌ హెబడాట్‌ హోసేన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement