Thursday, December 8, 2022

డిసెంబర్‌లో బంగ్లా పర్యటన.. విరామం కోహ్లీ రీ ఎంట్రీ

బంగ్లాదేశ్‌ పర్యటన కోసం బీసీసీఐ వన్డే సిరీస్‌ జట్టును ప్రకటించింది. రోహిత్‌ శర్మ సారథ్యంలో విరాట్‌ కోహ్లీ విరామం తర్వాత జట్టులో రానున్నాడు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ ల వన్డే సిరీస్‌కు యశ్‌ దయాల్‌, రవీంద్ర జడేజాల స్థానంలో ఫాస్ట్‌ బౌలర్‌ కుల్దిప్‌ సేన్‌, ఆల్‌ రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌లను ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నియమించింది.
దయాల్‌ వెనుముకలో సమస్య ఉంది. జడేజాకు మోకాలి గాయం ఉంది. అతను ఇంకా కోలుకోలేదు. బీసీసీఐ వైద్య పర్యవేక్షణలో జడేజా ఉన్నాడు.

- Advertisement -
   

గాయం నుంచి పూర్థి స్థాయిలో కోలుకోని ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాతో పాటు పేస్‌ బౌలర్‌ యష్‌ దయాల్‌ను జట్టు నుంచి తప్పించారు. వీరిద్దరి స్థానాల్లో ఆల్‌ రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌, పేసర్‌ కుల్దిప్‌ సేన్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ నెల 25 (నేటి) నుంచి అక్లాండ్‌లో ప్రారంభమయ్యే మూడుమ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు మొదటగా కుల్‌దీప్‌, షాబాజ్‌లు జట్టులో ఉన్నారు. అయితే వారు ఇప్పుడు బంగ్లా పర్యటనకు వెళ్లి జట్టులో భాగస్వాములవుతున్నారు. వచ్చే నెలలో బంగ్లాలో పర్యటించనున్న భారత్‌ మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement