Wednesday, April 24, 2024

బంగార్రాజు ఐటెం సాంగ్ లో : అద‌ర‌గొట్టిన ఫ‌రియా అబ్దుల్లా , నాగ‌చైత‌న్య

గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలో తండ్రి కొడుకు, నాగార్జున‌, నాగ‌చైత‌న్యలు తెర‌పై క‌నువిందు చేయ‌నున్నారు. కాగా ఈ చిత్రానికి క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ట‌ర్. ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి న‌టిస్తున్నారు. ఈ సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయ‌ని స‌మాచారం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఫరియా అబ్దుల్లా – చైతూ పై ఒక ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు. ఆ ఐటమ్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మరో ఐటమ్ సాంగ్ లో దీక్ష నగర్కార్ మెరవనుందని, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement