Tuesday, November 28, 2023

రాజ‌కీయాల వ‌ల్ల చాలా న‌ష్ట‌పోయా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బండ్ల గ‌ణేష్

తాను రాజ‌కీయాల కార‌ణంగా చాలా న‌ష్ట‌పోయాన‌ని చెప్పారు నిర్మాత‌..న‌టుడు బండ్ల గ‌ణేష్.. నెటిజన్లు చేసిన కామెంట్లకి ఆయన స్పందించారు. గతంలో పవన్ కళ్యాణ్‌ కోసం ఆయన ఓ టీవీ డిబేట్‌లో వాదించిన వీడియోని షేర్‌ చేశారు. అందులో ఎమ్మెల్యే రోజాతో బండ్ల గణేష్‌ టీవీ డిబేట్‌లో వాగ్వాదం జ‌రిపారు. పళ్లు రాలిపోతాయని రోజా విమర్శలు చేయగా, దానికి బండ్ల గణేష్‌ కూడా నీ పళ్లు రాలిపోతాయి. నీ పళ్లు రాలగొడతా అంటూ ఫైర్‌ అయ్యారు. ఏ మాట్లాడుతున్నావ్‌ వెదవ, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంది రోజా. ఎమ్మెల్యేవి అయి ఉండి అలానేనా మాట్లాడేది అంటూ తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు బండ్లగణేష్‌.. తాజాగా ఈ వీడియోని ఓ అభిమాని షేర్‌ చేస్తూ రోజాకి మన బండ్ల అన్న కరెక్ట్ అప్పట్లోనే రోజాకి లైవ్‌ డిబేట్‌లోనే చుక్కలు చూపించారని పేర్కొన్నారు.

- Advertisement -
   

మళ్లీ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ పోస్ట్ పెట్టగా, దీనికి బండ్ల గణేష్‌ రియాక్ట్ అయ్యారు. షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల వల్ల చాలా నష్టపోయానని తెలిపారు. రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను, నాకు ఏ రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే అని పేర్కొన్నారు. కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవారే రాజకీయాలకు రావాలి, మా బాస్‌ లాగా అని మరో జనసేన అభిమాని పోస్ట్ చేయగా, నాకంత స్థాయి లేదు. అంత గొప్ప వాన్ని కాదు సోదర అని దెండం పెట్టాడు బండ్ల గణేష్‌. ఇన్నాళ్లకు సరైన నిర్ణయం తీసుకున్నావ్‌ అన్నా అని మరో అభిమాని పెట్టిన పోస్ట్ కి ధన్యవాదాలు తెలిపారు బండ్ల.

Advertisement

తాజా వార్తలు

Advertisement