బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఆ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటే మంచిదని హితవు చెప్పారు. ఏ సందర్భంలోనైనా సామెతలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలన్నారు. లేకుంటే అభాసుపాలు కావాల్సి వస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా అనేది పవర్ సెంటర్ కాదని.. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అని గుర్తు చేశారు అర్వింద్.
- Advertisement -