Friday, February 3, 2023

ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఎట్టకేలకు ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు. నిర్మ‌ల్ జిల్లాలోని భైంసా మండలం గుండెగావ్ నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంమైంది. గుండెగావ్, మహాగావ్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. గుండేగాంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులతో సంజయ్ సమావేశమయ్యారు. మహాగాం మీదుగా ఛాతా వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్ర కొనసాగనుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement