Wednesday, March 29, 2023

15వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 15వ రోజు ప్రారంభమైంది. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలోని రాత్రి బస కేంద్రం నుంచి బండి సంజయ్ పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. జగిత్యాల టౌన్, ధరూర్, రాజారం, తారక రామ్ నగర్, నూకపల్లె, మల్యాల క్రాస్ రోడ్స్, ముత్యంపేట్ మీదుగా కొండగట్టు వరకు పాదయాత్ర కొనసాగనున్న‌ది. ఈరోజు మొత్తం 18 కిలోమీటర్ల మేర యాత్ర కొన‌సాగుతుంద‌ని బీజేపీ నాయ‌కులు తెలిపారు. ఇవాళ రాత్రికి కొండగట్టు సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement