Friday, April 26, 2024

ఒంగోలు నగరానికి నిరంతంగా తాగునీరు: మంత్రి బాలినేని

ఒంగోలు నగరానికి నిరంతరం తాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బుధవారం స్థానిక ఒంగోలు 37వ డివిజన్ చెన్నకేశవస్వామి లేఅవుట్‌లో రూ.1.65 కోట్లతో నిర్మిచిన వాటర్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒంగోలు నగర ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామాన్నారు. ఒంగోలు చెన్నకేశవస్వామి లేఅవుట్‌లో 500 కె.ఎల్.డి పరిమాణంతో నిర్మిచిన వాటర్ ట్యాంక్ 1,250 గృహాలకు నిరంతరం తాగునీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఒంగోలు నగరానికి తాగునీరు అందించడానికి గుండ్లకమ్మ జలాశయం నుండి ఒంగోలు వరకు తాగునీటి పైప్ లైన్స్ నిర్మాణానికి అవసరమైన 70 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడానికి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డులో చైత్యన్య కార్డియాక్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఒంగోలు నగరంలోని బాపూజీ గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఆఫీసు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వైసీపీ నేతలు సింగరాజు వెంకట్రావు, ఐ.ఘన శ్యామ్, కటారి శంకర్ రావు పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో బైక్ అదుపుతప్పి తండ్రి, కుమారుడు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement