Saturday, April 20, 2024

అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలు తప్పు .. మంత్రి రోజా

అక్కినేనిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… అవే వ్యాఖ్యలు ఎన్టీఆర్ పై చేస్తే… ఆ ఫ్యామిలీ ఎలా బాధ పడుతుందో ఆలోచించాలన్నారు. లోకేష్ యువగళం కాదు.. టీడీపీకి సర్వమంగళమన్నారు. ముందు టీడీపీ ప్రక్షాళన జరగాలన్నారు. పాదయాత్ర మొదటి రోజే లోకేష్ కు రియాల్టీ తెలుస్తుందన్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ తాపత్రయ పడుతున్నారన్నారు. జనసేన చంద్రసేననా లేక కన్ఫ్యూజన్ పార్టీనా అని ప్రశ్నించారు. తెలంగాణలోనూ పవన్ పోటీ చేస్తాననడం శుభ పరిణామమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement