Thursday, April 18, 2024

ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసిన బాలయ్య బ్లాక్‌బస్టర్ మూవీ..

యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన్న లేటెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ వీరసింహారెడ్డి. శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. కాగా, ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా బాలయ్య డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ ఇవ్వాల కొద్దిసేపటి క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ ముందుకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా డిస్నీ లో అందుబాటులో ఉంది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న వీరసింహారెడ్డి మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement