Friday, March 29, 2024

బాలయ్య అభిమానులకు శుభవార్త

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో బాల‌కృష్ణ హీరోగా BB3 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న మూవీపై అప్‌డేట్‌ను చిత్రయూనిట్ ఆదివారం ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12:33 గంటలకు మూవీ టైటిల్‌‌ను వెల్లడించనున్నట్లు తెలిపింది. దీంతో ఉగాది రోజు బాలయ్య అభిమానులకు శుభవార్త అందనుంది. ఈ చిత్రంలో బాల‌య్య రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో కనిపించ‌నున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ కొంతసేపు అఘోరా గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో భాగంగా బాలకృష్ణ అఘోరాగా కనిపిస్తాడని ఫిలింనగర్‌లో టాక్ వినపడుతోంది. ఈ లుక్‌లో బాలయ్య ఎలా ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. టైటిల్‌తో పాటు ఊహించని గెటప్‌తో ఉన్న బాలకృష్ణ దర్శనం ఇస్తాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాద‌ర్’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ‌ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement