Friday, April 19, 2024

బ‌ల‌గం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా మంత్రి కేటీఆర్

బ‌ల‌గం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజ‌రుకానున్నారు. రాజన్నసిరిసిల్లజిల్లా నుండి వస్తున్న తొలి పెద్ద సినిమా బలగం. 1997 లో సిరిసిల్ల మార్కెట్ లో కూరగాయలు అమ్మిన వేణు వెల్దండి …. తెలుగు పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో కమెడియన్‌ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కమెడియన్ ‘వేణు’. జబర్దస్త్‌లో తన కామెడీతో అందర్నీ ఆకట్టుకున్న వేణు.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారబోతున్నాడు. వేణు స్వస్థలం సిరిసిల్ల. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాజన్నసిరిసిల్లజిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో జరిగింది. బలగం సినిమాలో దాదాపు 200 మంది గ్రామస్థులు కనిపిస్తారు. అలాగే, బలగం సినిమాలో ఆర్టిఫిషియల్ తెలంగాణ యాస కాకుండా నాచ్యురల్ తెలంగాణ యాస చూడవచ్చు.ఈ చి్ర‌తంలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement