Wednesday, April 24, 2024

బ్యాడ్మింటన్‌ ఆసియా జూనియర్‌.. క్రీడాకారుల ఎంపికకు ట్రయల్స్‌

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యాడ్మింటన్‌ ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌ 2023 కోసం జూన్‌ 4 నుంచి 7వ తేదీ వరకు ఇక్కడి కర్నైల్‌ సింగ్‌ స్టేడియంలో సెలక్షన్‌ ట్రయల్స్‌ జరగనున్నాయి. అన్వేష గౌడ, అనుపమ ఉపాధ్యాయ, ఉన్నతి హోడా దేశానికి ప్రాతినిథ్యం వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఆసియా చాంపియన్‌షిప్స్‌ టోర్నమెంట్‌ కోసం భారత జట్టు ఎంపికకు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బిఎఐ) ట్రయల్స్‌ నిర్వహిస్తుంది.

యువ ప్రతిభావంతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడేందుకు ఒక గొప్ప వేదికను అందిస్తుందిస్తున్నట్లు బిఎఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టోర్నమెంట్‌ భారత యువ షట్లర్‌లకు విలువైన అంతర్జాతీయ గుర్తింపును పొందేందుకు అద్భుతమైన అవకాశంగా ఉపయోగపడుతుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement