Friday, March 29, 2024

బాబా రీ రిలీజ్.. నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా కొత్త సీన్లు.. డబ్బింగ్ చెప్పిన రజనీకాంత్

త‌మిళ సూప‌ర్ స్టార్ నటించి..నిర్మించిన చిత్రం బాబా. ఈ చిత్రంలో హీరోయిన్ గా మ‌నిషా కొయిరాలా న‌టించింది.కాగా ర‌జ‌నీకాంత్ ఈ చిత్రానికి కథ అందించి మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు . తాజాగా బాబా సినిమా మరోసారి తెరపైకి రాబోతుంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఇందులో కొన్ని కొత్త సీన్లు యాడ్‌ చేయబోతున్నారు. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని సీన్లు జోడించారట. వాటికి రజనీకాంత్‌ డబ్బింగ్‌ కూడా చెప్పడం విశేషం.

మ్యూజిక్‌ పరంగానూ ఫైన్‌ ట్యూన్‌ యాడ్‌ చేస్తున్నారట ఏ ఆర్‌ రెహ్మాన్‌. స్ట్రెయిట్‌ సినిమా రేంజ్‌లో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారట. ఇండియా వైడ్‌గా, ఓవరీస్‌లోనూ బాబా మూవీని భారీగా రిలీజ్‌ చేసేందుకు నిర్వహకులు ప్లాన్‌ చేస్తున్నారు. ట్రైలర్స్, ప్రోమో వీడియోలు కూడా ప్లాన్‌ చేశారట. అంతేకాదు త్వరలోనే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా షురూ చేయబోతున్నారని టాక్‌. సినిమాపై భారీ హైప్‌ పెంచబోతున్నారు. ఆ టైమ్‌లో డిజప్పాయింట్‌ చేయడంతో ఇప్పుడైనా ప్రశంసలు పొందేలా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ పుట్టిన రోజు. అదే రోజు ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement