Saturday, April 20, 2024

వాళ్ల బాబులు కూడా నన్ను అరెస్ట్ చేయలేరు: బాబా రాందేవ్

అల్లోపతి మందుల గురించి ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని ఆయన అన్నారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. వాళ్ల బాబులు కూడా తనను అరెస్ట్ చేయలేరని అన్నారు.

ప్రాచీన కాలం నుంచి మన ఆయుర్వేద శాస్త్రం యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని… అటువంటి ఆయుర్వేదాన్ని కాదని, అల్లోపతి మెడిసిన్ ను ప్రమోట్ చేస్తున్నారని… దేశంలో క్రిస్టియానిటీని పెంచి పోషించడానికే ఇది జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి అనేది పనికిమాలిన సైన్స్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై… ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాందేవ్ పై దేశద్రోహం కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement