Sunday, June 13, 2021

బయటపడ్డ బాబా లీలలు..

ఆశ్రమం, స్కూల్‌ పేరిట విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న బాబా లీలలుబయటకు వచ్చాయి. తమళనాడుకు చెందిన శివశంకర్‌ అలియాస్‌ శివశంకర్‌ బాబా చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కం సమీపంలోని రామరాజ్యం పేరిట నగర్‌ ఏర్పాటు చేసుకుని, ఆశ్రమాన్ని, సుశిల్‌ హరి పేరిట ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను నడుపుతున్నాడు. పద్మశేషాద్రి స్కూల్లో కీచక టీచర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. ఇద్దరు విద్యార్థినులు శివశంకర్‌ బాబాపై ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలో జరిగే పూజలు, నృత్య కార్యక్రమాల్లో బాబా లైంగిక వేధింపులు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులతోపాటు బాల బాలికలు, శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి రంగస్వామి నేతృత్వంలో బృందం రంగంలోకి దిగింది. గురువారం ఆశ్రమంవద్దకు వెళ్లగా బాబా లేకపోవడంతో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News