Saturday, November 2, 2024

ఐసీసీ వన్డే ర్యాంకిగ్స్:నంబర్ వన్ బాబర్ అజమ్, నెంబర్ టూ కోహ్లీ..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ తన నెంబర్‌ వన్‌ స్థానాన్ని మరింత పదిల చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో బాబర్‌ అజమ్‌ చివరి వన్డేలో అద్భుత శతకంతో మెరిశాడు. ఓవరాల్‌గా 873 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 857 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో ట్రెంట్‌ బౌల్ట్‌ 737 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. మెహదీ హసన్‌ 708 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్‌ విభాగంలో షకీబ్‌ అల్‌ హసన్‌ తొలి స్థానంలో ఉన్నాడు.

సీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో విండీస్‌ ఆటగాళ్లు దుమ్మురేపారు. ముఖ్యంగా బౌలర్‌ ఫాబియెన్‌ అలెన్‌ బౌలర్ల జాబితా ర్యాంకింగ్స్‌ విభాగంలో తొలిసారి టాప్‌ 10లో అడుగుపెట్టాడు. ఆసీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన అలెన్‌ 16 స్థానాలు ఎగబాకి 622 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. ఇక ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ 22వ స్థానంలో, డ్వేన్‌ బ్రేవో ఏడు స్థానాలు ఎగబాకి 37వ స్థానంలో, ఒబేడ్‌ మెకోయ్‌ 15 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రెయిజ్‌ షంషీ 821 పాయింట్లతో తొలి స్థానంలో, రషీద్‌ ఖాన్‌(719 పాయింట్లు) రెండో స్థానం, ఆదిల్‌ రషీద్‌( 695 పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో షిమ్రన్‌ హెట్‌మైర్‌ 37 స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో, లెండి సిమన్స్‌ ఆరు స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచారు. ఇక డేవిడ్‌ మలాన్‌ 888 పాయింట్లతో తొలి స్థానం, బాబర్‌ అజమ్‌(828 పాయింట్లు), ఆరోన్‌ ఫించ్‌(805 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండ్‌ విభాగంలో మహ్మద్‌ నబీ(285 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. షకీబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

View Post

ఈ వార్త కూడా చదవండి: చదువుకున్న అందరికీ సర్కారు నౌకరి రాదు.. హమాలీ పని ఉపాధి కాదా..?

Advertisement

తాజా వార్తలు

Advertisement