Friday, April 19, 2024

మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటిన ‘అవతార్ 2’

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలోనే రూ.100 కోట్ల మార్కును దాటింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు (శుక్రవారం) 40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ మూవీ, భారతీయ బాక్సాఫీస్ వద్ద స్థిరమైన పట్టును కొనసాగిస్తూ.. శనివారం 40.50 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఆదివారం ఆకట్టుకునే విధంగా 47 కోట్ల రూపాయలను రాబట్టింది.

సౌత్ ఇండియాలోని నైజాం, ఆంధ్రా సెక్టార్‌లలో అసామాన్యమైన సంఖ్యలతో ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే అద్భుతమైన స్కోర్‌ను సాధించింది. కేవలం నైజాం/ఆంధ్రా విభాగంలోనే మూడు రోజులలో రూ.30 కోట్లను సంపాదించింది. దీంతో, కేవలం నాలుగు రోజుల్లోనే ‘ఎవెంజర్స్:ఎండ్‌గేమ్’ రికార్డును బద్దలుకొట్టింది అవతార్ 2.

Advertisement

తాజా వార్తలు

Advertisement